
పాన్ ఇండియా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు ఈ రోజు. ఇక ప్రభాస్ పుట్టినరోజు సందర్బంగా అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ అందించింది రాధే శ్యామ్ చిత్ర యూనిట్. మొన్నీమధ్యనే రాధేశ్యామ్ నుంచి పోస్టర్ ను రిలీజ్ చేసిన ప్రభాస్ టీం .. ఇవాళ టీజర్ తో వదిలారు. ‘నా పేరు విక్రమాదిత్య.. నాకన్నీ తెలుసు’.. అంటూ సస్పెన్స్ ఫుల్ డైలాగ్స్ చెప్పి అలరించాడు.
‘నాకు నువ్వు తెలుసు.. నీ గుండె చప్పుడూ తెలుసు.. నీ ఓటములు తెలుసు.. నీ చావు తెలుసు.. నాకన్నీ తెలుసు.. కానీ.. నేనేవీ చెప్పను. నేను దేవుణ్నీ కాను.. మీలో ఒకడినీ కాను’ అంటూ డైలాగులతో హీట్ పెంచాడు.
ఇక ప్రభాస్ ఇందులో విక్రమాదిత్య గా చాలా కూల్ గా కనిపించాడు. డైలాగులకు తగ్గట్టు జస్టిన్ ప్రభాకరన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్. వింటేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది జనవరి 14న సినిమా విడుదల కానుంది.