
PM Modi Telangana Tour: ప్రధాని నరేంద్ర మోడీ శనివారం తెలంగాణకు రానున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మ.12:25 కు ప్రధాని మోడీ విశాఖ నుండి బయలుదేరి 1.30 కి బేగంపేటకు రానున్నారు. మ.2.15 కి బేగంపేట నుంచి రామగుండంకి పయనమవుతారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో పర్యటించి, బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రాజెక్టుల ప్రారంభం, శంకుస్థాపన, ఎరువుల కర్మాగారం జాతికి అంకితం కార్యక్రమాల తర్వాత ఢిల్లీకి బయల్దేరుతారు.