
PM Modi: మునుగోడు ఉపఎన్నిక ఫలితంపై ప్రధాని మోడీ స్పందించారు. బేగంపేట సభలో ప్రధాని ప్రసంగిస్తూ ‘తెలంగాణ బీజేపీ కార్యకర్తల పనితీరు నాకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. మీరు ఎంత గట్టిగా పోరాడారో మునుగోడు ఉపఎన్నికను చూస్తే అర్థం అవుతోంది. మునుగోడు బైపోల్ కోసం మంత్రులు, ఎమ్మెల్యేలంతా తరలివచ్చారు. ఒక్క ఉపఎన్నిక కోసం ప్రభుత్వం అంతా తరలివచ్చింది. తెలంగాణలో కమలం వికసించే పరిస్థితులు కనిపిస్తున్నాయి’ అని అన్నారు.