
దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో నీటి ఎద్దడి సమస్యపై ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ సీఎం జగన్కు ఫోన్ చేశారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం జగన్ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వర్షాల ప్రభావం తీవ్రంగా ఉన్న జిల్లాల్లో పరిస్థితిని సీఎం జగన్ ప్రధానికి వివరించారు.
చిత్తూరు, అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాల్లో వరదల పరిస్థితి, ఆయా ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయనకు వివరించారు. వరద బాధితుల సహాయార్థం నేవీ హెలికాప్టర్లను వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. దీనిపై స్పందించిన ప్రధాని.. ఎలాంటి సహాయం కావాలన్నా అడుగుతానని సీఎం జగన్కు స్పష్టం చేశారు. వరద సహాయక చర్యల్లో కేంద్రం అప్రమత్తంగా ఉంటుందని హామీ ఇచ్చారు.