
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా వరుసగా అప్డేట్లు వస్తూనే ఉన్నాయి. భీమ్లా నాయక్, హరిహర వీరమల్లు సినిమాల తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ మరో సినిమాను సెట్స్ మీదకు తీసుకు రానున్న సంగతి తెలిసిందే. ‘PSPK 28’ వర్కింగ్ టైటిల్‌తో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. గతేడాది విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్ విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ పుట్టిన రోజును పురస్కరించుకుని చిత్రబృందం తాజాగా ప్రీ లుక్‌ని విడుదల చేసింది. ఇందులో పవన్ ను సగమే చూపించారు. ఆ సగం లుక్కుతోనే కడుపు ఫుల్లుగా నిండినట్టు అయింది. జాతర షురూ అంటూ చిత్రయూనిట్ ఇచ్చిన అప్డేట్ చూస్తుంటే ఇకపై రచ్చ రచ్చే అన్నట్టు కనిపిస్తోంది. మళ్లీ ఫుల్లుగా లుక్కును రిలీజ్ చేస్తామని చెప్పకనే చెప్పేశారు. ఇక ఈ పోస్టరర్ వెనకాల ఇండియా గేట్ ఉండటం చూస్తుంటే కథ ఢిల్లీలో జరిగేలా కనిపిస్తోంది. ఈ తాజా అప్డేట్ తో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.
Many More Happy Returns to
The One and Only…..
@PawanKalyan ?????#JAATHARA SHURU #Team #PawanKalyan28 @harish2you @ThisIsDSP @DoP_Bose #AnandSai @MythriOfficial @venupro pic.twitter.com/fVpG8WlJOz— Harish Shankar .S (@harish2you) September 2, 2021