
నేడు జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 50వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో మూవీ అప్డేట్స్ తో పాటుగా బర్త్ డే హ్యాష్ ట్యాగ్స్ ని నేషనల్ వైడ్ ట్రెండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో సినీ రాజకీయ ప్రముఖులు పవన్ కల్యాణ్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా పవర్ స్టార్ కు స్పెషల్ బర్త్ డే విషెస్ అందజేశారు.
”హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్! మీకు నిజంగా ఈ ఏడాది అద్భుతంగా ఉండాలని.. ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను” అని మహేష్ బాబు ట్వీట్ చేశారు. పవన్ కు మహేష్ పుట్టినరోజు శుభాకాంక్షలు అందించడంతో ఖుషీ అవుతున్న అభిమానులు సోషల్ మీడియాలో ఈ ట్వీట్ ని వైరల్ చేసేస్తున్నారు. కాగా పవన్ – మహేష్ ల క్రేజ్ – స్టార్ డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Happy birthday @PawanKalyan! Wishing you a truly amazing year and great health always! ?
— Mahesh Babu (@urstrulyMahesh) September 2, 2021
ఇద్దరూ సినీ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తో ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ.. తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోడానికి చాలా కష్టపడ్డారు. టాలీవుడ్ లో సమవుజ్జీవులైన మహేష్ బాబు – పవన్ కళ్యాణ్ కలిసి ఓ మల్టీస్టారర్ మూవీ చేస్తే బాగుంటుందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. రాబోయే రోజుల్లో అసాధ్యం అనుకున్న ఈ ప్రాజెక్ట్ సుసాధ్యం అవుతుందేమో చూడాలి.