
ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు చేపట్టబోయే శ్రమదానం కార్యక్రమంలో పాల్గొనడానికి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. ఆయన ను స్వాగతం తెలపడానికి ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. రాజమహేంద్రవరంలో పోలీసులు అడుగడుగున ఆంక్షలు విధించడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయినప్పటికీ శ్రమదానంలో పాల్గొనాలని పవన్ నిర్ణయించారు.
హుకుంపేట-బాలాజీపేట రహదారిపై శ్రమదానం తర్వాత బహిరంగ సభలో పాల్గొననున్నారు. అయితే, సభా ప్రాంగణానికి చేరుకున్న దారులన్నింటినీ పోలీసులు మూసివేశారు. సభకు అన్ని వైపులా 5 కిలోమీటర్ల మేర ఆంక్షలు విధించారు. అయితే, పవన్ కల్యాణ్ నిర్వహించాలనుకున్న సభకు ఎలాంటి ఆటంకాలు ఉండబోవని పోలీసులు చెప్పడం గమనార్హం.