
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ట్విట్టర్ ద్వారా తనదైన శైలిలో విమర్శలు చేశారు. 140 దాడులు అంటూ దేవాలయాలు దేవతామూర్తుల విధ్వంసాలు అంటూ రాసుకొచ్చారు. రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఘాటుగా మాట్లాడిన పవన్, అప్పటి నుంచి వైసీపీ నాయకులకు, ఆయనకు మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరుగుతుంది.
“హిందూ దేవాలయాలు, హిందూ దేవతామూర్తుల విగ్రహాలపై ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 140 దాడులు, విధ్వంసాలు. వై.సి.పి. పాలనలో ఆంధ్రప్రదేశ్ లో ఈ రెండున్నర ఏళ్లలో జరిగిన ప్రగతి ఇదే! దాడులకు పాల్పడిన దోషులంతా క్షేమం.
ఎక్కడున్నాయి వై.సి.పి. గ్రామ సింహాలు? “
ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రగతి!
హిందూ దేవాలయాలు, హిందూ దేవతామూర్తుల విగ్రహాలపై ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 140 దాడులు, విధ్వంసాలు. వై.సి.పి. పాలనలో ఆంధ్రప్రదేశ్ లో ఈ రెండున్నర ఏళ్లలో జరిగిన ప్రగతి ఇదే! దాడులకు పాల్పడిన దోషులంతా క్షేమం.
ఎక్కడున్నాయి వై.సి.పి. గ్రామ సింహాలు? pic.twitter.com/cbfX4hI7bK— Pawan Kalyan (@PawanKalyan) September 28, 2021