
జనసేన చీఫ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీ గా వున్నాడు. షూటింగ్ దశలో చాలా సినిమాలు ఉన్నాయి. వీటితో పాటు రాజకీయాల్లో బిజీ గా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. మొన్న ఈ మధ్య జరిగిన సాయి తేజ్ సినిమా ‘రిపబ్లిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వైసీపీ ప్రభుత్వం పై విరుచుకు పడ్డ విషయం తెలిసిందే. సినిమా ఈవెంట్ ను కాస్త రాజకీయ సభలా మారింది అని విమర్శించిన వారు లేకపోలేదు. వరుసగా సినిమాల షూటింగుల్లో బిజీగా గడుపుతోన్న విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పోరాడతానని ఇప్పటికే ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. అనంతరం కూడా ట్విట్టర్ వేదికగా ఏపీ సర్కారుపై ఘాటుగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఏపీ మంత్రులు తనపై విరుచుకుపడుతున్న నేపథ్యంలో ఆయన తాజాగా మరో ట్వీట్ చేశారు.
వైసీపీ ప్రభుత్వం 'పాలసీ ఉగ్రవాదం' కి అన్నీ రంగాలు అన్ని వర్గాలు నాశనం అయిపోతున్నాయి. దీనిని ఎదుర్కోవలిసిన సమయం ఆసన్నమయింది..
— Pawan Kalyan (@PawanKalyan) September 28, 2021
“వైసీపీ ప్రభుత్వం ‘పాలసీ ఉగ్రవాదం’ కి అన్ని రంగాలు అన్ని వర్గాలు నాశనం అయిపోతున్నాయి. దీనిని ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమయింది” అంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తాను ఇక రాజకీయాలపైనే దృష్టి పెడతానన్న సంకేతాలు ఇచ్చారు.