
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చేవెళ్ల మండలం అజిజ్ నగర్లో జనసేన కార్యకర్తల మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ సమావేశంలో పవన్ మాట్లాడుతూ ” పోరాటం చేస్తేనే అడుగులు ముందుకు వేయడం తెలుసనీ, భయపెడితే బలపడడం తప్ప భయపడే ప్రసక్తి లేదని అన్నారు. తాను రాజకీయాల్లోకి వస్తాను అంటే చాలా మంది చాల రకాలుగా భయపెట్టారని, కానీ నాకు ఈ తెలంగాణ గడ్డ ధైర్యాన్ని ఇచ్చింది అని అన్నారు. 2009 లో జరిగిన ఎన్నికలప్పుడు పార్టీ తన చేతుల్లో లేదని, అప్పటి రాజకీయాలు తన ఆధీనంలో లేవని ఆయన అన్నారు. అన్నింటికీ సిద్దపడే ఈ రాజకీయాల్లోకి అడుగుపెట్టానని, జనసేన పార్టీ ఈ రాజకీయ చదరంగంలో అడుగులు వేసిందని చెప్తూ, భావజాలంతో ముందుసాగుతాం అని అన్నారు, తెలంగాణ ఇచ్చిన ధైర్యాన్ని, ఇక్కడి ప్రజలకు తాను రుణపడి ఉంటానని ఈ సందర్బంగా తెలిపారు.