
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ ‘భీమ్లా నాయక్’ మొదటిపాట ఈ రోజు రిలీజ్ అయ్యి యూట్యూబ్ రికార్డు లను షాక్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ బర్త్ డే పురస్కరించుకుని ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆదిత్య మ్యూజిక్ ద్వారా ‘భీమ్లా నాయక్’ పాటను విడుదల చేసారు. ఈ పాట రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే 4 లక్షల వ్యూస్ ని రాబట్టి యూట్యూబ్ ట్రేండింగ్ లో నెంబర్ 1 లో వుంది.
‘సెభాష్.. ఆడాగాదు ఈడాగాదు అమీరోళ్ల మేడాగాదు.. భీం భీం భీం భీం భీమ్లానాయక్… దంచి దడదడదడ లాడించే డ్యూటీ సేవక్…’ అంటూ సాగే ఈ జానపద గీతం ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది. ‘భీమ్లానాయక్’ టైటిల్ సాంగ్‌గా విడుదలైన ఈ పాట ఎంతగానో అలరిస్తోంది.
పిడివి ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ సాగుతున్న ఈ సినిమా మలయాళ సూపర్ హిట్ ‘అయ్యప్పనుం కోషియం’కి అఫీషియల్ రీమేక్‌గా తెరకెక్కుతుండగా, రానా దగ్గుబాటి మరొక హీరోగా నటిస్తున్నాడు. నిత్యా మీనన్, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు.