
ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు.
‘‘ 13 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నాడు. ఇప్పటి వరకు ఏం చేశాడు? ఏం సాధించాడు? ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటి నుంచి చొక్కాలు చింపుతున్నాడు. ఇప్పటి వరకు ఎన్ని చిరిగిపోయాయో ఆయనకే తెలియాలి. ఊరికే అరవడం తప్ప పవన్ చేసిందేమీ లేదు. చొక్కాలు చింపుకోవడం తప్ప ఆయన చేయగలిగిందేమీ లేదు’’ అని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు. పవన్ కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయారని ఎద్దేవా చేశారు.
నేడు గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ‘క్లీన్ ఆంధ్రప్రదేశ్’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు బొత్స చెప్పారు. చెత్త సేకరించే వాహనాలను బెంజి సర్కిల్ లో సీఎం జగన్ ప్రారంభిస్తారని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో చెత్త సేకరణకు 3,097 ఆటోలు, 1,771 ఈ-ఆటోలను వినియోగిస్తామని, సుమారు 38 వేల మంది శానిటరీ వర్కర్లు నిరంతరం పని చేస్తారని మంత్రి చెప్పారు.