
OTT Releases This Week: ఇటీవల విడుదలై ప్రేక్షకాదరణ పొందిన హిట్ సినిమాలు ఈ వారం ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. సుహాస్ ప్రధాన పాత్రలో షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన చిత్రం ‘రైటర్ పద్మభూషణ్’. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫార్మ్ జీ5లో ఈ నెల 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తొలి స్ట్రెయిట్ తెలుగు మూవీ ‘సార్’. ఈ చిత్రం ఈ నెల 17వ తేదీ నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది.