
NTR30: ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తోన్న సినిమాకు ‘దేవర’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు సమాచారం. ఈ టైటిల్ బండ్ల గణేష్ ది కాగా, ఆయన టైటిల్ రిజిస్ట్రేషన్ ను రెన్యూవల్ చేయించడం మర్చిపోయారట. దీంతో ఆ టైటిల్ ను కొరటాల శివ తీసుకున్నారట. ఈ విషయాన్ని బండ్ల గణేష్ ట్విట్టర్ లో షేర్ చేశారు. దీంతో ఎన్టీఆర్ 30వ సినిమాకు ‘దేవర’ టైటిల్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.