
పెట్రోల్, డీజిల్ పెంపు పై నిరసన తెలుపడానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘చలో రాజభవన్’ కార్యక్రమం చేప్పట్టిన సంగతి తెలిసిందే. దీనిలో పాల్గొన్న NSUI రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బలమూరి ని పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో పోలిసుల అత్యుత్సాహం వల్ల వెంకట్ పక్కటెముకలు ఫ్రాక్చర్ అయినట్టు తెలిసింది. యశోద హాస్పిటల్ లో చికిత్స పొందిన వెంకట్ ఈ మధ్యనే డిశ్చార్జ్ అయ్యారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి ,మంథని శాసనసభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, NSUI రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ ని కలిసి పరామర్శించి,మనో ధైర్యాన్ని ఇచ్చారు.