
నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ) ప్రవేశ పరీక్షకు మహిళలను అనుమతించక పోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విధాన నిర్ణయం ప్రకారమే మహిళలను అనుమతించడం లేదన్న ఆర్మీ వివరణను సుప్రీం ధర్మాసనం ఆక్షేపించింది. ఈ విధాన నిర్ణయంలో లింగ వివక్ష కనిపిస్తోందని పేర్కొంది. ఈ విషయంలో ఆర్మీ తన నిర్ణయాన్ని మార్చుకుని మహిళలను ఎన్డీఏ పరీక్షకు అనుమతించాలని ఆదేశించింది. తుది తీర్పుకు లోబడి అడ్మిషన్లపై అడ్మిషన్ల ప్రక్రియ జరగాలని సూచించింది.
ఎన్డీఏ ప్రవేశ పరీక్ష సెప్టెంబరు 5న జరగనున్న విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పుతో ప్రస్తుతానికి మహిళలను ప్రవేశ పరీక్షకు అనుమతించే అవకాశాలు ఉన్నాయి. సుప్రీం తుది తీర్పు వెలువడిన తర్వాత మాత్రమే ప్రవేశాలు జరగనున్నాయి.