
మోడీ ప్రభుత్వం రైతు చట్టాలను రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని స్వయంగా నరేంద్ర మోడీ ప్రకటించారు. ఆయన రైతు చట్టాలను వెనక్కి తీసుకుంటామని తెలిపారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఈ నిర్ణయం అమలు చేస్తామని ఆయన చెప్పారు.
రైతులు ఆందోళనను విరమించుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ విజ్ఞప్తి చేశారు.రైతులకు బాధ కలిగించి ఉంటే క్షమించాలని ఆయన అన్నారు. గత ఏడాది కి పైగా డిల్లీ సరిహద్దులలో రైతులు ఆందోళన చేస్తున్న నేపధ్యంలో మోడీ ఈ నిర్ణయం ప్రకటించారు. కాగా ఉత్తర ప్రదేశ్ ఎన్నికలపై ప్రభావం పడకుండా ఉండటానికి కూడా ఆయన ఈ ప్రకటన చేసి ఉండవచ్చు.