
గులాబ్’ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రంలోని పరిస్థితుల గురించి ఆరా తీయడానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు కేంద్రం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని మోదీ హామీనిచ్చారు. రాష్ట్ర ప్రజలు అందరూ సురక్షితంగా ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు. ఆదివారం అర్థరాత్రి గోపాల్పూర్-కళింగపట్నాల మధ్య గులాబ్ తుఫాన్ తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఆ సమయంలో తీర ప్రాంతాల్లో గంటకు 70 నుంచి 90కిమీ వేగంతో ఈదురు గాలులు వీయనున్నాయి. ఉత్తరాంధ్ర, ఒడిశాలకు ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖజిల్లాలకు భారీ వర్ష సూచనలు జారీ చేశారు. ఉభయ గోదావరి జిల్లాలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే.
గులాబ్ తుఫాన్ పరిస్థితి గురించి @ysjagan గారితో మాట్లాడాను .కేంద్రం నుంచి సహాయాన్ని తక్షణం అందేటట్లు చూస్తామని హామీ ఇచ్చాను. అందరు క్షేమంగా వుండాలని ప్రార్ధిస్తున్నాను .
— Narendra Modi (@narendramodi) September 26, 2021