
మా అక్క పై వ్యక్తిగత విమర్శలు చేయడం కరెక్ట్ కాదు. నందమూరి బాలకృష్ణ ఈ వివాదంపై మీడియా తో మాట్లాడుతూ …. అసెంబ్లీ లో ఉన్నామా అన్న అనుమానం కలుగుతుంది. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్లు కూడా చీదరించుకుంటారు. ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని ఉద్దేశించి అధికార వైసీపీ ఎమ్మెల్యేలు అనుచిత వ్యాఖ్యలు చేయడంపై నందమూరి కుటుంబం భగ్గుమంది.
భువనేశ్వరి సోదరుడు, వియ్యంకుడు కూడా అయిన హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మా అక్క జోలికి ఇంకోసారి వస్తే మెడలు విరిచేస్తానంటూ వైసీపీకి బాలయ్య వార్నింగ్ ఇచ్చారు.