
కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున హీరోగా గ్రామీణ నేపథ్యంలో ‘బంగార్రాజు’ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రం చకచకా షూటింగ్ జరుపుకుంటోంది. రీసెంట్గా ఈ సినిమా నుంచి వదిలిన పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. నాగార్జున లుక్ పరంగా కూడా మంచి మార్కులు కొట్టేశాడు.
తాజాగా ఈ సినిమాలో నాగలక్ష్మి పాత్రకు సంబంధించిన లుక్ను కృతిశెట్టి విడుదల చేశారు. గ్రామీణ ఎన్నికల్లో నాగలక్ష్మి విజయం సాధిస్తారు. ఈ పోస్టర్లో జనాలను చూస్తూ అప్పుడు తీసిన ఉత్సాహంలో ఆమె చేయి ఊపుతున్నట్లు కనిపిస్తోంది. ఆమె చేతులపై ఖరీదైన స్పెట్స్ కూడా కనిపిస్తున్నాయి. ఈ కలర్ఫుల్ లుక్లో కృతి శెట్టి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నారు. ‘బంగార్రాజు’లో నాగలక్ష్మి సందడి ఓ రేంజ్ లో ఉంటుందని అర్థమవుతోంది.