
నాగశౌర్య, రీతూ వర్మ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న ‘వరుడు కావలెను’ సినిమా ట్రైలర్ ను గురువారం నటుడు రానా దగ్గుబాటి విడుదల చేశారు. లక్ష్మీ సౌజన్య డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా అక్టోబరు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.