
Munugode MLA: ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గురువారం ప్రమాణస్వీకారం చేశారు. హైదరాబాద్ నాంపల్లి లోని తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తన చాంబర్లో ఆయనతో ప్రమాణం చేయించారు. ఆ తర్వాత అసెంబ్లీ రూల్స్ బుక్, ఐడీ కార్డును స్పీకర్ అందించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, హరీష్ రావు, జగదీశ్ రెడ్డి సహా ముఖ్యనేతలు హాజరయ్యారు.