
కడప జిల్లా రాజంపేట మున్సిపాలిటీని వైసీపీ కైవసం చేసుకుంది. మొత్తం 29 స్థానాల్లో వైసీపీ 24, టీడీపీ 4, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో గెలుపొందారు. కమలాపురం మున్సిపాలిటీని కూడా వైసీపీ కైవసం చేసుకుంది.
కర్నూలు జిల్లా బేతంచర్ల మున్సిపాలిటీని వైసీపీ కైవసం చేసుకుంది. 20 వార్డుల్లో ఓట్ల లెక్కింపు జరగగా 14 స్థానాల్లో వైసీపీ, 6 స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది.
గుంటూరు జిల్లా దాచేపల్లి మున్సిపాలిటీని వైసీపీ కైవసం చేసుకుంది. వైసీపీ 11, టీడీపీ 7, జనసేన 1, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో గెలుపొందారు. గురజాల మున్సిపాలిటీని కూడా వైసీపీ కైవసం చేసుకుంది.
ప్రకాశం జిల్లా దర్శి మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. మొత్తం 20 వార్డుల్లో టీడీపీ 13, వైసీపీ 7 స్థానాల్లో గెలుపొందాయి. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మున్సిపాలిటీని వైసీపీ కైవసం చేసుకుంది. మొత్తం 20 వార్డుల్లో వైసీపీ 12, టీడీపీ 4, జనసేన 3, ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. టీడీపీ కంచుకోట కుప్పంలో వైసీపీ విజయం సాధించింది. ఇప్పటి వరకు జరిగిన ఫలితాల్లో వైసీపీ 13, టీడీపీ 2 గెలుపొందాయి. మరికొన్ని వార్డుల్లో వైసీపీ ఆధిక్యంలో ఉంది.