
భారత క్రికెట్ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ జట్టులో మెంటార్‌గా కొత్త బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ప్రపంచకప్‌లో ఈ మాజీ సారథి కోహ్లీసేనకు ఉపయోగపడతాడని భావించి బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ, సెక్రటరీ జైషా ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ క్రమంలోనే పాకిస్థాన్‌తో తొలిపోరుకు ముందు ధోనీ ప్రాక్టీస్ సెషన్లో టీమ్ఇండియా ఆటగాళ్లతో కలిసి పనిచేస్తున్నాడు. అయితే, తాజాగా త్రోడౌన్ స్పెషలిస్టుగానూ బౌలింగ్ చేస్తూ కనిపించాడు. అందుకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ అభిమానులతో పంచుకొంది.‘టీమ్ఇండియా నూతన‘త్రోడౌన్ స్పెషలిస్టు మహేంద్రసింగ్ ధోనీని పరిచయం చేస్తున్నాం’అంటూ ట్విటర్లో పోస్టు చేసింది.