
ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు జట్టుకు మరో టైటిల్ అందించి మాంచి ఊపుమీదున్న ఎంఎస్ ధోనీ ప్రస్తుతం టీమిండియా మెంటార్ గా కొత్త బాధ్యతలు అందుకున్నాడు. ఐపీఎల్ బయో బబుల్‌ని వీడిన ధోనీ, యూఏఈలోని భారత క్రికెట్ జట్టు బయో బబుల్‌లో చేరాడు. అక్టోబర్ 17 నుంచి ప్రపంచ కప్ మ్యాచులు ప్రారంభమైన తరువాత, భారత జట్టు కూడా మొదటిసారిగా మైదానంలోకి వచ్చింది.
వీరిలో అతిపెద్ద ఆకర్షణ మాత్రం టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ధోనినే. జట్టు సలహాదారుగా ధోనీ తన పని ప్రారంభించాడు. ప్రాక్టీసు సందర్భంగా ఆటగాళ్లతో పాటు మైదానంలోకి వచ్చాడు. బ్యాటింగ్ లో ఆటగాళ్లకు సూచనలు ఇస్తూ ధోనీ బిజీగా కనిపించాడు. దీనికి సంబంధించిన ఫొటోలను బీసీసీఐ సోషల్ మీడియాలో పంచుకుంది. కింగ్‌కు స్వాగతం. ఎంఎస్ ధోని టీమిండియా కోసం కొత్త పాత్రలో తిరిగి వచ్చాడు అని రాసుకొచ్చింది. కాగా, ధోనీ… మెంటార్‌గా టీ20 వరల్డ్ కప్ టోర్నీకి ఎంపికైనప్పటికీ, ఈ బాధ్యతలు నిర్వర్తించడానికి మహీ నయా పైసా కూడా తీసుకోవడం లేదని బీసీసీఐ సెక్రటరీ జే షా ప్రకటించిన విషయం తెలిసిందే.
Extending a very warm welcome to the KING ?@msdhoni is back with #TeamIndia and in a new role!? pic.twitter.com/Ew5PylMdRy
— BCCI (@BCCI) October 17, 2021