
MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పెయింటింగ్ వేస్తూ కనిపించాడు. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. IPL 2023 కోసం చెపాక్ స్టేడియంలో సీఎస్కే క్రికెటర్లు ప్రాక్టీస్ లో నిమగ్నమయ్యారు.
ఈ స్టేడియంలో కుర్చీలకు పెయింటింగ్ పనులు చేస్తుండగా.. ధోనీ కూడా పసుపు, నీలం రంగు స్ప్రే పెయింట్ క్యాన్లతో బయటకు వచ్చి రెండు కుర్చీలకు పెయింట్ చేశాడు. ఈ వీడియోను సీఎస్కే తమ ట్విట్టర్ లో షేర్ చేసింది.