
MS Dhoni: టీమిండియా మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ కు గుడ్ బై చెప్పనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ 2023 తర్వాత ధోని ఐపీఎల్ కి రిటైర్మెంట్ ప్రకటిస్తాడని, అతను టీమిండియా ఆటగాళ్లతో కలిసి పనిచేసే ఛాన్సుందని టెలిగ్రాఫ్ వెబ్ సైట్ పేర్కొంది. ఎంఎస్ ధోని అనుభవాన్ని ఉపయోగించుకునేందుకు బీసీసీఐ ఆసక్తిగా ఉందట. భారత ప్లేయర్లు ఫియర్ లెస్ క్రికెట్ ఆడేందుకు ధోని సలహాలు ఉపయోగపడతాయని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం.