
MP Sanjay Raut: మనీలాండరింగ్ కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు బెయిల్ మంజూరు అయింది. ఆయనతో పాటు ప్రవీణ్ రౌత్‌కు ముంబై పీఎంఎల్ఏ కోర్టు బెయిల్ ఇచ్చింది. రూ.1000 కోట్ల పత్రచాల్ భూ కుంభకోణం కేసులో జులై 31న ఆయనను ఈడీ అరెస్ట్ చేసింది. దాదాపు 100 రోజులు జైలులో ఉన్న ఆయనకు బుధవారం కోర్టు బెయిల్ ఇచ్చింది.
