
నిజామాబాద్ ఎంపీ అరవింద్ తెలంగాణ మినిస్టర్ హరీష్ రావు పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఓడిపోయే నియోజకవర్గానికి హరీశ్ రావు అనే ఫకీర్ ను కేసీఆర్ పంపిస్తారని ఎద్దేవా చేశారు. కొంగలా ఉన్న హరీశ్ రావు అన్నీ కొంగ కథలే చెపుతారని అన్నారు. అమలు చేయలేని మేనిఫెస్టోను ఎందుకు పెట్టావని కేసీఆర్ ను ప్రశ్నించారు. విధి విధానాలు లేని వాటిని ఎందుకు పెట్టారని అడిగారు. దుకాణాలకు పోవడం అక్కడి నుంచి చైన్ లు తీసుకెళ్లడమే కల్వకుంట్ల కవిత పని అని విమర్శించారు.