
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, కృతి శెట్టి జంటగా నటిస్తున్న తాజా చిత్రం సక్సెస్‌ఫుల్‌గా ఫస్ట్ షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో కంప్లీట్ చేసింది చిత్రబృందం. కోలీవుడ్ దర్శకుడు ఎన్.లింగుస్వామి ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గత నెల సెట్స్ మీదకి వచ్చిన ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి కాగా, ఫస్ట్ హాఫ్ లోని కీలక సన్నివేశాలను తెరకెక్కించినట్టు తెలుస్తోంది. రామ్ కెరీర్లో ఇది 19వ చిత్రం. రాక్‌స్టార్ దేవిశ్రిప్రసాద్ సంగీతం అందుస్తుండగా, తెలుగు – తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు.