
జీతూ జోసెఫ్ – మోహన్ లాల్ కాంబినేషన్ లో వచ్చిన మలయాళ మూవీ ‘దృశ్యం’ ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీళ్లిద్దరి కాంబినేషన్ లోనే మరో సినిమా ’12th Man’ తెరకెక్కనున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ మూవీ షూటింగ్ మొదలైంది. మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిస్తున్న ఈ మూవీ తొలి షెడ్యూల్ లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ప్లాన్ చేశారు. పోస్టర్ తోనే ఉత్కంఠను పెంచుతున్న ’12th Man’ మరో బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందేమో వేచి చూడాల్సిందే. జీతూ జోసెఫ్ కథలు సహజత్వానికి దగ్గరగా ఉండటమే కాకుండా ఆసక్తి రేకెత్తించే విధంగా ఉంటాయి. గతంలో విడుదలైన ‘దృశ్యం’ పలు భాషల్లోకి రీమేక్ అయిన విషయం తెలిసిందే.