
టాలీవుడ్లో మరో భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. అగ్రహీరో రామ్ చరణ్, దక్షిణాది టాప్ డైరెక్టర్ శంకర్ కలయికలో వస్తున్న భారీ చిత్రానికి నేడు పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. కాగా ఈ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి, బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ ముఖ్య అతిథులుగా హాజరవనున్నట్టు సమాచారం. కాగా, ఈ మూవీ ఫస్ట్ పోస్టర్ను తాజాగా వదిలింది చిత్రబృందం. ఈ పోస్టర్ గ్రాండ్ లుక్తో అదిరిపోయింది. ఈ పోస్టర్లో సినిమా టీమ్ అంతా బ్లాక్ సూట్లు ధరించి చేతిలో ఫైల్స్ , బ్యాగ్లతో కనిపిస్తున్నారు. ఈ పోస్టర్లో సినిమాలో నటించే నటీనటులతోపాటు దర్శకుడు శంకర్ అలాగే నిర్మాత దిల్ రాజు కూడా ఉన్నారు. ఈ సినిమాలో హీరోయిన్ అంజలి, సునీల్, జై రామ్ కీలకపాత్రల్లో కనిపించనున్నారని పోస్టర్ చూస్తే అర్ధం అవుతుంది. సంగీత దర్శకుడు తమన్ ఈ సినిమాకు స్వరాలు అందించనున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూట్ ప్రారంభం కానుంది. మరోవైపు రామ్చరణ్.. ‘ఆచార్య’, ‘ఆర్ఆర్ఆర్’ల ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు.
We are coming !!!#RC15 #SVC50 Muhurtham Ceremony Today. @shankarshanmugh @AlwaysRamCharan@advani_kiara @MusicThaman @DOP_Tirru @ramjowrites @saimadhav_burra @SVC_official pic.twitter.com/VnwUtmPaXP
— Sri Venkateswara Creations (@SVC_official) September 8, 2021