
శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘మహా సముద్రం’. అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇంటెన్స్ లవ్, యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని అందిస్తుండగా.. జగపతిబాబు, రావు రమేశ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 14న ఈ సినిమా విడుదల కానుంది.
Setting up our 1st Sail⛵ in the Tale of #ImmeasurableLove❤️#MahaSamudram Voyage Begins on 23rd Sep with an Engrossing Trailer❤️?@Actor_Siddharth @aditiraohydari @ItsAnuEmmanuel @DirAjayBhupathi @AnilSunkara1 @chaitanmusic @AKentsOfficial#MahaSamudramonOct14th pic.twitter.com/WhgaleB5oZ
— Sharwanand (@ImSharwanand) September 20, 2021
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ను చిత్రయూనిట్ విడుదల చేసింది. సెప్టెంబర్ 23న మహా సముద్రం ట్రైలర్‌ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్లో సిద్దార్థ్, శర్వానంద్ ఇద్దరూ యాక్షన్ అవతార్‌లో కనిపిస్తున్నారు. యాక్షన్ సీక్వెన్స్‌లకు ఇద్దరు హీరోలు రెడీగా ఉన్నట్టు పోస్టర్‌ను చూస్తే అర్థమవుతోంది.