
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ‘లైగర్’. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీతో పాటు ఇతర ప్రధాన భారతీయ భాషల్లోనూ విడుదల కానుంది. ముంబైలో ఎక్కువ భాగం చిత్రీకరణ జరుగుతోంది. కోవిడ్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ ఎఫెక్టులతో సినిమా షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చింది. ఎట్టకేలకు బుధవారం ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ షూటింగ్‌ను ప్రారంభించినట్లు నిర్మాతలు తెలియజేశారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే టైటిల్ లుక్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో లుక్‌ను విడుదల చేశారు.
BLOOD. SWEAT. VIOLENCE. #LIGER Shoot Resumes. pic.twitter.com/x2wJVuDByd
— Vijay Deverakonda (@TheDeverakonda) September 15, 2021
విజయ్ దేవరకొండ ఈ ఫొటోను పోస్ట్ చేసి “రక్తం, చెమట, వయోలెన్స్… లైగర్ షూట్ తిరిగి ప్రారంభం…” అంటూ రాసుకొచ్చాడు. షర్టు లేకుండా బాక్సింగ్ రింగ్ లో విజయ్ దేవరకొండ వెనక్కి తిరిగి కూర్చుని ఉండడం అందులో కన్పిస్తోంది. ఈ రోజు సాయంత్రం గోవాలో జరిగే నైట్ ఎఫెక్ట్‌లో చిత్రీకరించనున్న యాక్షన్ సన్నివేశాల కోసం బృందం భారీ సెట్‌ను ఏర్పాటు చేసింది. ఆ సెట్ విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.