
మాస్ మహారాజ్ రవితేజ హీరో గా ‘ఖిలాడీ’ సినిమా రూపు దిద్దుకుంటుంది. రమేశ్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా ను కోనేరు సత్యనారాయణ నిర్మించారు. మాస్ మహారాజ్ కి జోడిగా డింపుల్ హయతి – మీనాక్షి చౌదరి నటించారు.
విలన్ గా యాక్షన్ కింగ్ అర్జున్ కనిపించనున్నాడు. వినాయక చవితి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి, ఒక లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు.
https://www.youtube.com/watch?v=BMmQSraC_oo
శ్రీమణి సాహిత్యం అందించిన ‘చిన్నప్పుడు నాకు అమ్మ గోరుముద్ద ఇష్టం’ అంటూ ఈ పాట సాగుతోంది. రవితేజ – డింపుల్ పై చిత్రీకరించిన ఈ పాట బీట్ బాగుంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పన … హరిప్రియ ఆలాపన మనసుకు ఇట్టే అల్లుకుపోతుంది. హీరో పట్ల తన మనసులోని భావాలను హీరోయిన్ ఆవిష్కరించే తీరు కొత్తగా .. ఆకట్టుకునేలా ఉంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.