
‘సైరా నరసింహారెడ్డి’ తర్వాత వరుస సినిమాలను చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికే ‘ఆచార్య’ సినిమాను పూర్తి చేసిన చిరు, లూసిఫర్ రీమేక్ ‘గాడ్ ఫాదర్’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. దీని తర్వాత మెహర్ రమేశ్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ను చేయబోతున్న సంగతి కూడా తెలిసిందే. ఇది కూడా తమిళ చిత్రం ‘వేదాళం’కు రీమేక్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇది సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా సాగే చిత్రం. ఇందులో చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తి సురేశ్ నటించబోతుంది. ఇక, హీరోయిన్ గా మిల్కీ బ్యూటీ తమన్నాని అనుకుంటున్నట్లు చిత్ర సీమలో టాక్. తమిళం లో అజిత్ సరసన శృతి హాసన్ నటించగా, తెలుగులో శృతి హాసన్ పాత్రని తమన్నా చేయబోతున్నారని తెలిసింది.
ఇది వరకు చిరంజీవితో సైరా నరసింహారెడ్డిలో తమన్నా నటించింది. ఆ చిత్రంలో చిన్న పాత్రే అయినా, సినిమాకు చాలా కీలకమైన రోల్. ఇప్పుడు మరోసారి మెగాస్టార్‌తో తమన్నా నటించడానికి ఓకే చెప్పినట్లు టాక్. త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. వచ్చే నెలలో ఈ చిత్రం అధికారికంగా ప్రారంభమవుతుంది. ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాకు మహతి సాగర్ సంగీత దర్శకుడు. ‘భోళా శంకర్’ సినిమాలో తమన్నా, చిరు ఆన్ స్క్రీన్ పెయిర్ ఎలా ఉండబోతుందో చూడాలి.