
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. అనిల్ రావిపూడి ‘ఎఫ్ 3’ త్వరలో షూటింగ్ కూడా పూర్తి చేసుకోబోతుంది. ‘ఎఫ్ 3’ సెట్స్ పై ఉండగానే ‘గని’ అంటూ కొత్త సినిమా పట్టాలికించి రిలీజ్ కి రెడీ అయిపొయింది.
బాక్సింగ్ నేపథ్యంలో వరుణ్ తేజ్ ‘గని’ సినిమా ఉండబోతుంది. ఈ సినిమాతో కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో, వరుణ్ తేజ్ జోడీగా సయీ మంజ్రేకర్ మెరవనుంది. తెలుగులో ఆమె చేసిన తొలి సినిమా ఇదే. ఈ సినిమాతోనే ఆమె టాలీవుడ్ లో పరిచయమవుతోంది.
ముందుగా ఈ సినిమాను ‘దీపావళి’ కానుకగా నవంబర్ 4వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. కానీ ఆ తరువాత వాయిదా వేసుకున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి ‘గని’ ఫస్టు పంచ్ పేరుతో ఒక వీడియోను వదిలారు. అంతేకాదు ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా చెప్పేశారు.
ఈ సినిమాను డిసెంబర్ 3వ తేదీన విడుదల చేయనున్నారు. డిసెంబర్ మాసంలోకి మరో కొత్త సినిమా ఎంటర్ అయింది. ఆ నెలలో కూడా పోటీ గట్టిగానే ఉండనుందని తెలుస్తోంది.