
కరుణకుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు, ఆనంది జంటగా నటిస్తున్న సినిమా ’శ్రీదేవి సోడా సెంటర్’. ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. సోడా సెంటర్ నడిపే శ్రీదేవితో సూరిబాబు అనే కుర్రాడు ప్రేమలో పడటం ఎలాంటి పరిణామాలకు దారితీసిందనే కథతో ఈ చిత్రాన్ని రూపొందించారు. సూరిబాబు పాత్రలో సుధీర్ బాబు, శ్రీదేవి పాత్రలో ఆనంది నటించిన ఈ చిత్రం రేపు విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ఓ ఆసక్తికర పోస్ట్ చేసింది.
Thank you Darling #Prabhas for #SrideviSodaCenter? team special interview & generous support by publishing on your FB wall
▶️ https://t.co/n8cjXvX5H1#PrabhassupportsSSC#SrideviSodaCenterOn27thAug@isudheerbabu @70mmEntertains @VijayChilla @devireddyshashi @Karunafilmmaker pic.twitter.com/en6iky7nAJ
— 70MM Entertainments (@70mmEntertains) August 26, 2021
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ప్రత్యేక ఇంటర్వ్యూ ను షేర్ చేసింది. సుధీర్, తాను పాత స్నేహితులమేనని, ఈ మూవీ టీజర్ చాలా అద్భుతంగా ఉందని ప్రభాస్ అన్నాడు. ఈ మూవీ గ్లింప్స్ లో బోట్ షాట్ తో పాటు సుధీర్ బాబు కండలు తిరిగిన శరీరం అద్భుతంగా ఉన్నాయని ప్రభాస్ ప్రశంసించాడు. యాక్షన్ ఎపిసోడ్స్‌లో డూప్ లేకుండా సుధీర్ బాబు నటించాడని చిత్రయూనిట్ చెప్పింది. ఈ చిత్రంలో బోటింగ్ రేసింగ్ కు సంబంధించిన విశేషాలను ప్రభాస్‌కు చిత్రయూనిట్ వివరించింది.