
నితిన్, నభా నటేశ్ జంటగా రూపొందిన చిత్రం ‘మాస్ట్రో’. హిందీలో విజయవంతమైన ‘అంధాధున్’ రీమేక్‌గా రూపొందింది. ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రముఖ హీరోయిన్ తమన్నా కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ డిస్నీ+ హాట్‌స్టార్ వేదికగా త్వరలోనే రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ‘మాస్ట్రో’ సినిమా ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్ర బృందం. ఆసక్తికర సన్నివేశాలతో ఈ ట్రైలర్ ఆద్యంతం అలరించేలా ఉంది.
ఈ చిత్రంలో నితిన్ అంధుడిగా చేసిన నటన మెప్పిస్తుంది. నబ్బ నటేష్, తమన్నా లా అందం కనువిందు చేస్తోంది. నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలిచింది. మహతి స్వర సాగర్ స్వరపరచిన సంగీతం చాల బాగుంది. శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు. కథానాయకుడిగా నితిన్‌కి ఇది 30వ చిత్రం.