
నాని హీరోగా, సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్ లు గా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా రూపొందింది. ఈ సినిమా షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకొని, నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.
దుష్టశక్తి – దైవశక్తి మధ్య పోరాటం ప్రధానమైన అంశంగా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. కాగా ఈ సినిమా ఈ కాలం లో జరిగే కథనే, ఇందులో సాయిపల్లవి పాత్రకి కొన్ని దైవశక్తులు ఉంటాయనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ అంశానికి సంబంధించిన గ్రాఫిక్స్ కూడా ఒక రేంజ్ లో ఉండనున్నాయని అంటున్నారు.
వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకి, మిక్కీ జె.మేయర్ సంగీతాన్ని సమకూర్చాడు. జిషు సేన్ గుప్తా – మురళీ శర్మ కీలకమైన పాత్రలను పోషించిన ఈ సినిమా నుంచి, త్వరలోనే విడుదల తేదీ ప్రకటన రానుంది. తొలిసారిగా నాని టచ్ చేస్తున్న ఈ పాయింట్ ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.