
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తెలుగులో వరుస సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇటీవల టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ములతో మూవీ ప్రకటించిన ధనుష్.. తాజాగా మరికొందరు తెలుగు దర్శకులతో సినిమాలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ‘ఆర్ఎక్స్ 100’ సూపర్ హిట్ సినిమాతో దర్శకుడిగా మారిన అజయ్ భూపతితో సినిమా చేసేందుకు ధనుష్ ఓకే చెప్పినట్టు సమాచారం. ధనుష్ స్వయంగా అజయ్ భూపతిని పిలిపించుకుని కథ ఉంటే చెప్పమని అడిగినట్లు కోలీవుడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది. దీంతో ధనుష్ కోసం కథను సిద్ధం చేయడంలో అజయ్ భూపతి బిజీగా ఉన్నారు. ప్రస్తుతం శర్వానంద్, సిద్దార్థ్ కలిసి నటిస్తున్న ‘మహా సముద్రం’ సినిమాకు అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ములతో పాన్ ఇండియా సినిమా చేసేందుకు ధనుష్ ఓకే చెప్పాడు. తెలుగులో ధనుష్ మొత్తం మూడు చిత్రాలు చేయనున్నాడని సమాచారం. శేఖర్ కమ్ములతో మూవీతో పాటు, వెంకీ అట్లూరి, అజయ్ భూపతితో కూడా చర్చలు జరుపుతున్నాడట. అజయ్ భూపతి మేకింగ్ చాలా వరకు కోలీవుడ్ ఆడియెన్స్ కు దగ్గరగా ఉంటుందనీ అందుకే తనకోసం స్టోరీ రేడీ చేయమని ధనుష్ చెప్పాడట. ఆర్ ఎక్స్ 100 తర్వాత మహా సముద్రం తెరకెక్కిస్తున్నాడు అజయ్. ఈ మూవీ పూర్తైన తర్వాత డైరెక్ట్ గా ధనుష్ తో సినిమా చేయనున్నట్లు సమాచారం.