
శంకర్ దర్శకత్వంలో కమలహాసన్, కాజట్ జంటగా నటిస్తున్న‘భారతీయుడు’ (తమిళంలో ఇండియన్) సీక్వెల్ షూటింగ్ కొంత భాగం జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఈ సినిమా సెట్స్ లో ప్రమాదం జరగడం, ఆ తర్వాత కరోనా పరిస్థితుల కారణంగా షూటింగ్ ఆలస్యమైంది. ఈ సీక్వెల్ షూటింగ్ తిరిగి ప్రారంభిద్దామనుకుంటున్న తరుణంలో చిత్ర నిర్మాతకు, దర్శకుడికి మధ్య వివాదం తలెత్తడంతో ఈ వ్యవహారం న్యాయస్థానానికి వెళ్లింది. దర్శక, నిర్మాతలు తమ సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలని కోర్టు సూచించినప్పటికి ఈ వ్యవహారం ఓ కొలిక్కి రాలేదు. దీంతో షూటింగ్ ఆగిపోయింది.
ఈ విషయం గురించి ప్రముఖ నటుడు కమలహాసన్ ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. దర్శక, నిర్మాతల మధ్య ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు. అరవై శాతం వరకు సమస్య పరిష్కారమైందని అన్నారు. మొత్తం సమస్య త్వరలోనే సమసిపోతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. తాను ప్రస్తుతం నటిస్తున్న ‘విక్రమ్’ సినిమా తర్వాత ‘భారతీయుడు’ సీక్వెల్ షూటింగ్ కొనసాగుతుందని అన్నారు.