
తెలుగులో రొటీన్‌కు భిన్నంగా సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ‘అ!’, ‘కల్కి’, ‘జాంబీ రెడ్డి’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులని అలరించిన ప్రశాంత్ వర్మ ప్రస్తుతం ‘హను – మాన్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ తాజాగా విడుదలైంది. కాగా ఈ టీజర్ ఎంతో ఆకట్టుకునేవిధంగా ఉంది. భారీ గ్రాఫిక్స్ తో టీజర్ కలర్ ఫుల్ గా కనిపిస్తోంది. ఇక ఇండియాలోనే ‘హను – మాన్’ మొదటి సూపర్ హీరో ఫిల్మ్ గా తెరకెక్కుతోంది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సంధర్బంగా హను-మాన్ టీజర్ ను విడుదల చేస్తూ అంజనాద్రి కొండల నుండి హనుమంతుడు వచ్చాడని చిత్ర యూనిట్ క్యాప్షన్ ఇచ్చింది. వీడియో చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇది వేరే లెవల్లో ఉందని చెప్పాలి. ఈ సినిమాని పాన్ ఇండియన్ లెవెల్లో రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ చిత్రాన్నిఅత్యాధునిక విఎఫ్ఎక్స్ తో రూపొందించనున్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. నిరంజన్ రెడ్డి నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతోంది.