
నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ సినిమా కోసం అభిమానులు మరికొన్నాళ్లు ఎదురుచూడాలేమో! దసరాకు వస్తుందని అనుకున్న ఈ సినిమాను సంక్రాంతికి తీసుకురానున్నట్లు వార్తలు వస్తున్నాయి. నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘అఖండ’. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్లు. ‘అఖండ’ దసరాకు కాకుండా సంక్రాంతికి విడుదల చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే త్వరలో ఓ పోస్టర్ ను కూడా చిత్ర బృందం రిలీజ్ చేయనుందట.
విభిన్నమైన యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమాలో బాలకృష్ణ రెండు పాత్రల్లో సందడి చేయనున్నారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాత. పూర్ణ, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం పాట చిత్రీకరణ కోసం గోవా వెళ్లింది చిత్రబృందం. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘భీమ్లా నాయక్’, సూపర్ స్టార్ మహేశ్ ‘సర్కారు వారి పాట’, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమాలు సంక్రాంతి బరిలో ఉంటాయని ఇప్పటికే ప్రకటించారు. ఈ చిత్రాలు వరుసగా జనవరి 12, 13, 14 తేదీల్లో థియేటర్లలో విడుదల కానున్నాయి. ఒకవేళ ‘అఖండ’ రిలీజ్ కూడా అప్పుడే అయితే ఏ రోజున విడుదలవుతుందో చూడాలి.