
హీరో మోహన్ బాబు ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన సోదరుడు రంగస్వామి నాయుడు గుండెపోటుతో మరణించారు. రంగస్వామికి 63 ఏళ్లు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. రంగస్వామి నాయుడు తిరుపతిలో వ్యవసాయం చేస్తూ మోహన్ బాబు స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన అంత్యక్రియలు గురువారం తిరుపతిలో నిర్వహించనున్నారు. అంత్యక్రియలకు మంచు ఫ్యామిలీతో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.