
ఏపీలోని అధికార పార్టీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ మహ్మద్ కరీమున్నీసా గుండెపోటుతో చనిపోయారు. ఉదయం అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఆమె రాత్రి అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఆస్పత్రికి తీసుకువెళ్లిన కొద్దిసేపటికే ఆమె తుది శ్వాస విడిచారు. ఆమె కార్పొరేటర్ నుండి ఎమ్మెల్సీగా ఎదిగారు. ఆమె మరణంతో కృష్ణా జిల్లాలో విషాద ఛాయలు కనిపిస్తునాయి.