
MLC Elections Results: ఏపీలో తాజగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఇందులో వైసీపీ హవా కొనసాగిస్తుంది. ఇప్పటికే శ్రీకాకుళంలో సత్తా చాటిన వైసీపీ పశ్చిమ గోదావరిలోనూ తన హవా చూపించింది. వైసీపీ అభ్యర్థి కవురు శ్రీనివాస్ ప్రత్యర్థి రవీంద్రపై గెలుపొందారు. శ్రీనివాస్‌కు 481 ఓట్లు రాగా, రవీంద్రకు 460 ఓట్లు, ఇండిపెండెంట్ అభ్యర్థికి 122 ఓట్లు వచ్చాయి.