
జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్) దర్శకత్వంలో సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన నవల కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘కొండపొలం’. పంజా వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ హీరో హీరోయిన్ లు గా నటించారు. ఈ చిత్రానికి రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మాతలు. నేడు (అక్టోబర్ 8) ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రాన్ని తీసుకు వచ్చారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కి ముందుగానే సినిమాను చూపించారు ఈ చిత్ర యూనిట్. అనంతరం సామాజిక మాధ్యమాల వేదికగా తన స్పందన తెలియజేశారు.
Just watched #KondaPolam
A beautiful rustic love story with a powerful message. I love how Krish always deals with different genres & picks pertinent issues & extracts fantastic performances from artists.I trust this film will win as much acclaim & awards as it will get rewards. pic.twitter.com/tv4bZTv07q— Chiranjeevi Konidela (@KChiruTweets) October 7, 2021
‘కొండపొలం సినిమా పవర్ ఫుల్ సందేశంతో కూడుకున్న అందమైన గ్రామీణ ప్రేమ కథ. ఎప్పుడూ విభిన్న కథలు ఎంచుకుని, నటీనటుల నుంచి చక్కని నటన రాబట్టగల సత్తా క్రిష్ కి ఉంది. ఈ చిత్రం ఎంతో మంది ప్రశంసలు, ఎన్నో అవార్డులను గెలుస్తుందని ఆశిస్తున్నాను. వాస్తవానికి నేను కొండపొలం రచన చదవలేదు. ఓ రోజు వైష్ణవ్ వచ్చి క్రిష్ దర్శకత్వంలో కొండపొలం అనే సినిమా చేస్తున్నానని చెప్పగానే సరే అన్నాను. క్రిష్ దర్శకత్వంలో విభిన్న పాత్రల్లో నటించే అవకాశం వస్తుందనే ఉద్దేశంతో సరేనన్నాను. అయితే నేను ఏదనుకున్నానో ఈ సినిమా అంతకుమించి ఉంది…’’ అని చిరు ప్రశంసించారు. కాగా, కొండపొలం సినిమాకు చిరంజీవి నుంచి దక్కిన అభినందనలకు కృతజ్ఞతలు తెలిపారు దర్శకుడు క్రిష్.