
లేడీ ఓరియేంటేడ్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక పంథాను సృష్టించుకుంది. గత కొంతకాలంగా తెలుగు సినిమాకు దూరంగా ఉంటున్న ఈ భామ తాజాగా చిరంజీవి సరసన నటించే అవకాశం సొంతం చేసుకుంది.
చిరంజీవి కథానాయకుడిగా మోహన్‌రాజా దర్శకత్వంలో ‘గాడ్‌ఫాదర్’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. మలయాళ ‘లూసిఫర్’కు రీమేక్ ఇది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందనుంది.
ఈ సినిమాలో కథానాయికగా నయనతారను ఖరారు చేశారు. గురువారం ఆమె జన్మదినం సందర్భంగా చిత్రబృందం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. ‘సైరా’ చిత్రంలో చిరంజీవి జోడీగా మెప్పించిన నయనతార మరోమారు ఆయనతో నటించబోతుండటం విశేషం. ‘గాడ్‌ఫాదర్’ కథాగమనంలో నయనతార పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని చిత్రబృందం తెలిపింది.