
‘ఆచార్య’ తరవాత లూసీఫర్ రీమేక్ ‘గాడ్ ఫాదర్’ని పట్టాలెక్కించాడు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు ‘భోళా శంకర్’నీ సెట్స్‌పైకి తీసుకెళ్లబోతున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 154వ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. తమిళ మూవీ ‘వేదాళం’ రీమేక్‌గా ఈ మూవీ రూపొందుతోంది. చిరు బర్త్‌డే (అగష్టు 22) రోజున ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడగా.. ఇప్పటి వరకు దీనికి సంబంధించిన ఎలాంటి అప్డేట్ రాలేదు.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీకి సంబంధించిన కొత్త అప్డేట్ను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది చిత్ర బృందం. ఈ సినిమా పూజా కార్యక్రమాలను నవంబర్ 11న ఉదయం గం.7:45నిలకు నిర్వహించబోతున్నట్టు, రెగ్యులర్ షూటింగ్‌ను 15వ తేదీ నుంచి ప్రారంభించబోతున్నట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా సోషల్ మీడియా ద్వారా వదిలారు. ఇందులో చిరు విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. ఆయన ఈ సినిమాలో గుండుతో కూడా కనిపించే అవకాశాలున్నట్లు సమాచారం. ఇందులో చిరుకు సోదరిగా కీర్తి సురేశ్ నటించనుంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.
The Auspicious Day is Set for the MEGA LAUNCH ✨
MEGA ? @KChiruTweets – @MeherRamesh Film #BholaaShankar ? Muhurtam Ceremony will be held on 11-11-21, 7:45AM ?
Mega Shoot Begins from 15-11-21?@KeerthyOfficial @AnilSunkara1 #MahatiSwaraSagar @AKentsOfficial @BholaaShankar pic.twitter.com/6GuN6Zkqez
— AK Entertainments (@AKentsOfficial) October 27, 2021